Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Apr 2024 21:06 IST

1. గ్రూప్‌ -2 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌ -2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా.. 2557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో రిజెక్ట్‌ చేశారు. ఈ మేరకు  క్వాలిఫై అయిన, రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను వేర్వేరుగా అధికారులు విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నాకు అనుభవం ఉంది.. పవన్‌కు పవర్‌ ఉంది: చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘‘నాకు అనుభవం ఉంది.. పవన్‌కు పవర్‌ ఉంది. అగ్నికి వాయువు తోడైనట్లు... ప్రజాగళానికి వారాహి తోడైంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి: పవన్‌

బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైకాపా కేబినెట్‌లో ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. రైతును ఏడిపించిన వైకాపా ప్రభుత్వం తుడిచి పెట్టుకుపోవాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూ.6లక్షల నగదుతో పోలీసులకు చిక్కిన వైకాపా ఎంపీ కార్యదర్శి

ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ సర్కిల్‌లో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు కార్యదర్శి దశరథరామిరెడ్డి కారును ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కారు డ్యాష్‌ బోర్డులో ఉన్న రూ.6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. డీఎంకే అహంకారంలో మునిగిపోయింది: ప్రధాని మోదీ

తమిళనాడు అధికార పార్టీ డీఎంకేపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ ద్వేషపూరిత, విభజన రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని మెట్టుపాలయంలో భాజపా ఏర్పాటుచేసిన ర్యాలీలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. డీఎంకే అహంకారంలో మునిగిపోయిందని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ.. ‘ఇండియా’ కూటమి అజెండా ఒక్కటేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆమ్‌ఆద్మీకి ఎదురుదెబ్బ.. కేజ్రీవాల్ అరెస్టు వేళ మంత్రి రాజీనామా

దిల్లీ మద్యం పాలసీ కేసులో తమ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం దిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. కేబినెట్‌, పార్టీ పదవులను వదులుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇన్ఫోసిస్‌ దాతృత్వం.. కర్ణాటక పోలీసులకు ₹33 కోట్లు

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. సైబర్‌ నేరాలపై పోరాటంలో భాగంగా బెంగళూరు పోలీసులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందజేసింది. కర్ణాటక పోలీసుల సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా రూ.33 కోట్లు మంజూరుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ నెలలో భారత్‌కు ఎలాన్‌ మస్క్‌.. టెస్లా ఫ్యాక్టరీపై ప్రకటన?

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ నెలలో భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతోనూ భేటీ కానున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా దేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ కారణంతో ముంబయి మ్యాచ్‌లను సగమే చూసేవాడిని: సూర్యకుమార్ యాదవ్

కొన్ని రోజుల కిందట అతడు మోకాలి గాయానికి, స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్సలు చేయించుకుని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరాడు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌. ‘‘ఎన్‌సీఏలో ఉన్నప్పుడు రోజూ రాత్రి 10:30 - 12:45 గంటల మధ్య పడుకుని ఉదయం తొందరగా నిద్ర లేచేవాడిని. ఈ కారణంగా ముంబయి మ్యాచ్‌లను సగమే చూశా. మిగిలిన ఆటను మరుసటి రోజు చూశాను’’ అని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారు..!

వీఐపీ సంస్కృతిని తొలగిస్తున్నామని ఇటీవల పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఇప్పుడు ఆయన విషయంలోనే వీఐపీ కల్చర్‌ను పాటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని