Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Mar 2024 13:02 IST

1. ‘భారత ప్రజలారా క్షమించండి’: దౌత్యవివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

భారత్‌తో దౌత్యవివాదం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాల్దీవుల(Maldives) మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్( Mohamed Nasheed ) ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలు తెలియజేశారు. మనదేశంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. పూర్తి కథనం

2. అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌ భేటీ.. ఎన్డీయేలోకి తెదేపాను ఆహ్వానించిన భాజపా

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.పూర్తి కథనం

3. కజిరంగ నేషనల్‌ పార్క్‌లో.. ఏనుగుపై మోదీ సఫారీ

ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) శనివారం అస్సాం (Assam)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌ (Kaziranga National Park)ను ఆయన సందర్శించారు. అక్కడ ఏనుగు ఎక్కి (elephant safari) సఫారీ చేశారు. 1957 తర్వాత ఈ పార్క్‌ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం. పూర్తి కథనం

4.వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైకాపా దాడి

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి తండ్రిపై వైకాపా నేతలు దాడి చేశారు. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి జాగరణ కోసం వెళ్లిన దస్తగిరి తండ్రి షేక్‌ హాజీవలిని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు.పూర్తి కథనం

5. గాజాలో మరో విషాదం.. ఆహార పార్సిళ్ల పారాచ్యూట్ కూలి పలువురి మృతి

గాజాలో మరో విషాదం చోటు చేసుకొంది. మానవతా సాయం కోసం క్యూలో ఎదురుచూస్తున్న గాజా (Gaza)వాసులపై విమానాల నుంచి జారవిడిచిన ఆహార ప్యాకెట్ల పారాచ్యూట్ కూలింది. భారీ పార్సిళ్లు పడడంతో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.పూర్తి కథనం

6. దుబాయ్‌ నుంచి రాగానే వ్యక్తి కిడ్నాప్‌.. బంగారం లాక్కెళ్లిన దుండగులు

కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్‌నకు గురయ్యాడు. బాధితుని బంధువులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాపర్లు అతడిని వదిలేశారు. కడప ఖలీల్ నగర్‌కు చెందిన ఇలియాజ్ జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. పూర్తి కథనం

7. కెనడాలో నిజ్జర్‌ హత్య దృశ్యాలు వెలుగులోకి..

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య ఘటన భారత్‌, కెనడా (Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రూడో సర్కారు దర్యాప్తు చేపట్టింది. కాగా.. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత హత్యకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.పూర్తి కథనం

8. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పూర్తి కథనం

9. మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

మధ్యపద్రేశ్‌ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయం (secretariat) ‘వల్లభ్‌ భవన్‌’లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ బహుళ అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.పూర్తి కథనం

10. భారత్‌-చైనా సరిహద్దులో సేలా టన్నెల్‌ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన మోదీ

ఇండియా-చైనా (India-China) సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో నిర్మించిన సేలా టన్నెల్‌ (Sela Tunnel)ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్‌- వికసిత్‌ నార్త్‌ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని