Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Mar 2024 09:06 IST

1. ఇదేం ఉచితం.. జగనన్నా..!

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో నిరుపేదలు, అభాగ్యులకు 25 శాతం సీట్లు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చట్టం ప్రకారం ఉచిత సీట్లను రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే కేటాయిస్తున్నారు. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్‌ బోధించే ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. పూర్తి కథనం

2. భలే మంచి ఈవీ బేరం

విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. అదే సమయంలో పెట్రోలు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు రూ.1 లక్ష దరిదాపుల్లోనే లభిస్తున్నాయి. పూర్తి కథనం

3. సొంత గొప్పల జగన్‌.. మంచినీళ్లు ఏవి?

ఒక్క అవకాశమిస్తే... అంతా మార్చేస్తానని... అందరినీ ఆదుకుంటానని పాదయాత్రలు చేసి ప్రమాణం చేసిన వ్యక్తి... మార్చటం మాట అటుంచి... మంచినీళ్లయినా ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు! ఈ మాట విపక్షాలది కాదు... వైకాపా వారే ధర్నాలు చేసి మరీ చెబుతున్నారు! జగనన్నపాలనకు ఇంతకంటే అద్దం ఏం కావాలి?పూర్తి కథనం

4. ర్యాంకుల్లో పడిపోతున్నాం

సమాజాభివృద్ధికి ఉపకరించే పరిశోధనలు... విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే విద్యను అందిస్తున్నామంటూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు.. పరిపాలనా యంత్రాంగం చేస్తున్న ప్రకటనలు నీటిమూటలవుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్సిటీల్లో బోధనా ప్రమాణాలు, పరిశోధన అంశాలపై నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) గతేడాది జూన్‌లో ప్రకటించిన ర్యాంకుల్లో తొలి పదిస్థానాల్లో  రాష్ట్రంలోని ఒక్క విశ్వవిద్యాలయం పేరు కనిపించలేదు.పూర్తి కథనం

5. బరిలో పది... గెలిచేది ఏది?

సినీ ప్రపంచంలోని నటీనటులంతా ఒక్కసారైన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డును అందుకోవాలని కలలు కనేవారే. వాటిని సాకారం చేసుకునేందుకు చిన్న ఆస్కారం ఉన్న వదులుకోరు. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పనిచేసే వారికి ఆస్కార్‌ అవార్డే ఓ వరం. ఆ పురస్కారాన్ని అందుకునేందుకు వివిధ విభాగాలు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి కథనం

6. సచివాలయమా.. వైకాపా కార్యాలయమా

వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యక్రమాలకు వేదికలుగా మార్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని అగ్రహారం గ్రామ సచివాలయంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయాల కన్వీనర్లతో శనివారం ‘సిద్ధం సభ’కు అవగాహన కల్పించారు.పూర్తి కథనం

7. నువ్వు కట్టేయ్‌.. నే చూసుకుంటా.. వెలంపల్లి అరాచకం..

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నానుడి. కానీ ఇపుడు ‘రాజు’ గారు తలుచుకుంటే అసాధ్యం... సుసాధ్యం అవుతుందంటున్నారు మధురానగర్‌ వాసులు. నాడు వద్దన్నది నేడు ముద్దు అవుతుందని మధురానగర్‌ పై వంతెన పక్కన పునఃప్రారంభమైన దుకాణాల నిర్మాణాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగర వాసులకు వరుసగా హామీలు గుప్పిస్తున్న ఓ ప్రజాప్రతినిధి.. నిర్మాణదారులకు నువ్వు కట్టేయ్‌... అంతా నేచూసుకుంటా అంటూ అడ్డగోలు హామీ ఇచ్చినట్లు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. పూర్తి కథనం

8. మూల కణం విలువ ఘనం!

పుట్టబోయే బిడ్డ కలకాలం ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రతి తల్లి తపన. భవిష్యత్తులో తన బిడ్డలో ఏదైనా అవయవం దెబ్బతింటే? ఒక్క కణంతో అవయవాన్ని మళ్లీ సృష్టించవచ్చునని, ఆ కణం బిడ్డకు ఆహారమందించే బొడ్డుతాడులోనే ఉందని తెలిస్తే ఇంకేముంది.. ఒడిలో తన బిడ్డవలే పదిలంగా దాస్తుంది. మున్ముందు బిడ్డ శరీరానికి చెందిన ఏ అవయవాన్నైనా పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం బొడ్డుతాడులోని మూలకణాలకు ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.పూర్తి కథనం

9. ప్రజల గొంతెండి.. ప్రభుత్వం మిన్నకుండి

గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ముందే నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. నీటి ఎద్దడిని గుర్తించి పరిష్కరించే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేపట్టడం లేదు. వేసవిలో గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ సన్నద్ధత కార్యక్రమం క్రాస్‌ చేపడుతోంది. పూర్తి కథనం

10. ఆ వ్యథ.. మనకొద్దు

బెంగళూరులో తీవ్ర నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 60శాతం మంది ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటిని వృథా చేస్తే రూ.5000 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలోనూ 2019లో అదే పరిస్థితి. చివరికి రైల్వే వ్యాగన్ల ద్వారా తాగునీటిని తరలించారు. ఈ మహానగరాలతో పోల్చితే హైదరాబాద్‌ శరవేగంగా పెరుగుతోంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని