Rajya sabha: రాజ్యసభలో 12మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు!

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్‌ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచిత .....

Published : 29 Nov 2021 16:19 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్‌ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

సస్పెండ్‌ అయిన 12మంది సభ్యులు వీరే..

ఫూలోదేవి నేతం (కాంగ్రెస్‌), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్‌ బోరా (కాంగ్రెస్), రాజామణి పటేల్‌ (కాంగ్రెస్‌), అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌ (కాంగ్రెస్‌), డోలా సేన్‌ (తృణమూల్‌), శాంతా ఛత్రీ (తృణమూల్‌),  ప్రియాంకా చతుర్వేది (శివసేన), అనిల్‌ దేశాయ్‌ (శివసేన), బినోయ్‌ విశ్వం (సీపీఐ), కరీం (సీపీఎం)

రేపటికి సభ వాయిదా

మరోవైపు, రాజ్యసభలో తొలిరోజే విపక్షాల ఆందోళనల పర్వం కొనసాగింది. సాగుచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను కొనసాగించడం కష్టమని భావించిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని