Antarctica: 7,500 చదరపు అడుగుల భారత జాతీయ పతాక ప్రదర్శన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి.

Updated : 20 Dec 2021 04:51 IST

అంటార్కిటికా: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్(హెచ్‌ఎమ్‌ఐ) వివిధ దేశాల్లో పలు విన్యాసాలను ప్రదర్శించింది. హెచ్‌ఎమ్‌ఐ ప్రిన్సిపాల్ కెప్టెన్ జై కిషన్.. చిలీలోని ఆండీస్ శ్రేణుల్లో స్కైడైవింగ్ చేశారు. 13 వేల అడుగుల ఎత్తునుంచి దూకి.. 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతోపాటు కెప్టెన్ జై కిషన్ ఆధ్వర్యంలో.. ఈ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సాహసయాత్ర బృందం.. ఈనెల 6న అంటార్కిటికా ఖండంలో 7,500ల చదరపు అడుగుల భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు