మహమ్మారులకు టీకాల చెక్‌

అంటువ్యాధి ప్రబలితే ఎలాంటి వినాశకర పరిస్థితులు తలెత్తుతాయో కరోనా మహమ్మారి ప్రపంచానికి గుర్తుచేసింది. ఆధునిక కాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సమయంలోనూ శాస్త్రవేత్తలకు కొవిడ్‌ అనేక సవాళ్లను విసిరింది....

Updated : 12 Dec 2020 13:31 IST

భయంకర వ్యాధులకు వ్యాక్సిన్లతో అడ్డుకట్ట

ఇంటర్నెట్ డెస్క్‌: అంటువ్యాధి ప్రబలితే ఎలాంటి వినాశకర పరిస్థితులు తలెత్తుతాయో కరోనా మహమ్మారి ప్రపంచానికి గుర్తుచేసింది. ఆధునిక  సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సమయంలోనూ శాస్త్రవేత్తలకు కొవిడ్‌ అనేక సవాళ్లను విసిరింది. వ్యాధినిరోధక వ్యాక్సిన్లు సత్పలితాలను ఇస్తుండటంతో భవిష్యత్తుపై ఆశ కలుగుతోంది. కానీ మానవుల రోగనిరోధకతతో పోరాడిన మొట్టమొదటి వ్యాధి కరోనా కాదు. మనుషుల జీవితాల్లో పెను మార్పులకు అనేక మహమ్మారులు కారణమయ్యాయి. వాటిని విజయవంతంగా నిరోధించిన టీకాలు కూడా చాలానే ఉన్నాయి. చరిత్రలోనే అతిపెద్ద మహమ్మారిగా అభివర్ణించే మశూచి వ్యాధి ఒక్క 20వ శతాబ్దంలోనే 30 కోట్ల మంది ప్రాణాలను హరించింది. ఒకరినుంచి మరొకరికి సులభంగా సోకే స్వభావం ఉన్న మశూచి బారిన పడినవారిలో 30 శాతం మంది మరణించారు. ఇంతటి తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొనే మార్గాలకోసం ప్రజలు శతాబ్దాలుగా అన్వేషించారు. మశూచిపై పోరాటం వైద్య ప్రగతికి దారితీసి.. టీకా అభివృద్ధికి దోహదపడింది.

క్రీ.శ.1000వ సంవత్సరంలో చైనాలో ప్రాథమికంగా చికిత్సా విధానాన్ని కనుక్కోగా మొట్టమొదట మశూచి టీకాను ఎడ్వర్డ్‌ జెన్నర్‌ అభివృద్ధి చేశారు. కానీ మశూచిపై పోరాటం అనుకున్నంత వేగవంతంగా సాగలేదు. 1967లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మశూచి నిర్మూలన కార్యక్రమాన్ని తీవ్రతరం చేసిన తర్వాత వ్యాధి నియంత్రణలోకి రావడం ప్రారంభమైంది. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఈ వ్యాధి ఇప్పుడు కేవలం రెండు చోట్ల మాత్రమే ఉంది. ఆ రెండు అత్యంత భద్రత మధ్య ఉన్న అమెరికా, రష్యా ప్రయోగశాలలు. ఈ ప్రయోగశాలలు మినహా ఇంకెక్కడా ఈ అంటువ్యాధి లేదు.

పోలియో, తట్టు, మలేరియా వ్యాధుల ప్రభావం.. వాటిని అరికట్టేందుకు చేసిన కృషి.. తదితర సమాచారం కోసం కింది వీడియోను చూడండి..

ఇవీ చదవండి...

అమెరికాలో కొవిడ్‌-19 విలయం.. మూడు లక్షలు దాటిన మరణాలు

ఫైజర్‌ టీకా వినియోగానికి అమెరికా అనుమతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు