బయటికెళ్తే మాస్క్‌ తప్పనిసరి: సీడీసీ

అమెరికాలో కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం అంతకంతకూ పెరుగుతుండటంతో ఆ దేశ వ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) పలు సూచనలు చేసింది. అమెరికన్లు ఇంట్లో ఉన్నా.. లేదా బయటికెళ్లినా ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కును తీయవద్దని కోరింది.

Published : 06 Dec 2020 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం అంతకంతకూ పెరుగుతుండటంతో ఆ దేశ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) పలు సూచనలు చేసింది. అమెరికన్లు బయటికెళ్లినప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. ఇంట్లో ఎవరైనా వ్యక్తులు కొవిడ్‌ బారిన పడితే మిగతా వాళ్లూ మాస్కులు వేసుకోవాలని పేర్కొంది. అమెరికాలో కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మరణాల రేటు పెరుగుతున్న క్రమంలో సీడీసీ ఈ సూచనలు చేయడం గమనార్హం. 

సీడీసీ వెల్లడించిన ప్రకారం.. ‘అంటువ్యాధులు చాలా వరకు లక్షణాలు లేని వ్యక్తుల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్నాయి. అలాంటి వ్యాధుల్ని దరిచేరనీయకుండా మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయి. వ్యక్తులు ఎవరైనా కరోనా బారిన పడిన వారితో కలిసి ఇంట్లో ఉండాల్సి వచ్చినపుడు మాస్కు తప్పనిసరిగా వినియోగించాలి. కొనుగోలు చేయలేకపోతున్న వారికోసం ప్రభుత్వం మాస్కుల పంపిణీ చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కోసం మల్టీలేయర్‌ క్లాత్‌ మాస్కులు లేదా నాన్‌ మెడికల్‌ డిస్పోజబుల్‌ మాస్కులను పంపిణీ చేయనున్నాం’ అని సీడీసీ సిఫారసు చేసింది. కాగా అమెరికాలో ఇప్పటి వరకు 1.40కోట్ల కరోనా కేసులు నమోదు కాగా.. 2.70లక్షల మంది మహమ్మారి కారణంగా మరణించారు. 

ఇదీ చదవండి

24 గంటల్లోనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని