యువకుడి పొట్టలో 35 ఇనుప వస్తువులు!

కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడి పొట్టలో 35 ఇనుప వస్తువులను వైద్యులు గుర్తించారు. వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన...

Updated : 05 Oct 2020 12:27 IST

ఉన్నావ్‌: కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడి పొట్టలో 35 ఇనుప వస్తువులను వైద్యులు గుర్తించారు. వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉన్నావ్‌లోని శుక్లాగంజ్‌కు చెందిన కరణ్‌ అనే యువకుడు గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నొప్పి భరించలేకపోయిన యువకుడు నాలుగు రోజుల క్రితం చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షించగా కరణ్‌ కడుపులో ఇనుప కడ్డీలేవో ఉన్నట్లు తేలింది.

అనంతరం సుమారు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి 35 ఇనుప కడ్డీలు, మేకులను బయటకు తీశారు. వీటిని చూసిన వైద్యులు, యువకుడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఇనుప సామాను సుమారు 250 గ్రాముల బరువు తూగుతుందని తెలిపారు. అయితే, ఈ ఇనుప కడ్డీలు, మేకులు అతడి కడుపులోకి ఎలా వెళ్లాయన్నది తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని