స్వీయ నిర్బంధంలోకి కేరళ సీఎం

కేరళ సీఎం పినరయి విజయన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల కొలికోడ్‌ విమాన ప్రమాద ఘటన సహాయక చర్యల్లో పాల్గొన్న మలప్పురం......

Published : 14 Aug 2020 19:30 IST

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల కొలికోడ్‌ విమాన ప్రమాద ఘటన సహాయక చర్యల్లో పాల్గొన్న మలప్పురం జిల్లా కలెక్టర్‌తో పాటు మొత్తం 22 మంది అధికారులకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్‌ కె.గోపాలకృష్ణన్‌తో కాంటాక్ట్‌ అయిన వారి జాబితాలో సీఎం విజయన్‌తో పాటు మంత్రులు కేకే శైలజ, ఏసీ మొయిదీన్‌, ఈ.చంద్రశేఖరన్‌ కూడా ఉన్నారు. దీంతో విజయన్‌ సహా మంత్రులు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు సమాచారం. విమాన ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించిన విషయం తెలిసిందే. విజయన్‌ హోం క్వారంటైన్‌లో ఉండటంతో తిరువనంతపురంలో రేపు జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి సురేంద్రన్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని