ఆ పేలుడులోనే మరణించిన దుండగుడు

క్రిస్మస్‌ రోజు అమెరికాను కలవరానికి గురిచేసిన బాంబు పేలుడు ఘటనకు కారణమైన దుండుగుడు అక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 63 ఏళ్ల ఆంటోనీ వార్నర్‌ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చారు.......

Updated : 28 Dec 2020 11:27 IST

వాషింగ్టన్‌: క్రిస్మస్‌ రోజు అమెరికాను కలవరానికి గురిచేసిన బాంబు పేలుడు ఘటనకు కారణమైన దుండుగుడు అక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 63 ఏళ్ల ఆంటోనీ వార్నర్‌ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో చెల్లా చెదురుగా పడి ఉన్న మావన అవశేషాలు అతనివే అని ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలినట్లు వెల్లడించారు. టెన్నెస్సీ రాష్ట్రం నాష్‌విల్లేలోని డౌన్‌టౌన్‌ వీధిలో పార్క్‌ చేసిన తన మోటార్‌ వాహనంలోనే వార్నర్‌ బాంబు పేల్చుకున్నట్లు తెలిపారు. అయితే, బాంబు పేల్చడం వెనుక అతని ఉద్దేశం ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.

క్రిస్మస్‌ రోజు నాష్‌విల్లేలో ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగుడు అమర్చిన బాంబు పేలిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉన్నప్పటికీ.. ఘటన ఉదయం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు దాటికి సమీపంలోని భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి.

ఇవీ చదవండి..

అమెరికాలో భారీ పేలుడు

మనసు మార్చుకున్న ట్రంప్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని