ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యంపై తాజా బులిటెన్‌

 మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు దిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్‌ రిఫెరల్‌ ఆస్పత్రి .......

Updated : 22 Aug 2022 16:41 IST

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు దిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్‌ రిఫెరల్‌ ఆస్పత్రి వెల్లడించింది. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి శనివారం బులెటిన్‌ విడుదల చేసింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స కొనసాగిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తుతం డీప్‌ కోమాలోనే ఉన్నప్పటికీ గతంలో కంటే ఆరోగ్య సూచీల్లో మెరుగుదల ఉన్నట్టు వెల్లడించారు. ప్రణబ్‌ శరీరంలో రక్త ప్రసరణ, పల్స్‌ రేటు స్థిరంగా, సాధారణంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన మూత్రపిండ సంబంధిత వ్యవస్థ పని తీరు కూడా కాస్త మెరుగ్గానే ఉన్నట్టు తెలిపారు. 

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10వ తేదీన ప్రణబ్‌ ముఖర్జీకి వైద్యులు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయనకు కొవిడ్‌ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు