భారత్‌లో కరోనా @ డిశ్చార్జిల్లో ఇదే రికార్డు!
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు ఈ వైరస్ కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటికే కొవిడ్‌తో చికిత్సపొందుతున్నవారి కంటే కోలుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక్క మంగళవారం రోజే 51,706మంది కోలుకొని డిశ్చార్జి కావడం విశేషం. ఇప్పటివరకు దేశంలో ఒక్కరోజులో కోలుకున్నవారి సంఖ్యతో పోలిస్తే ఇదే అత్యధికం. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 19,08,254 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 12,82,215 మంది కరోనాను జయించి డిశ్చార్జి కాగా.. 39,795 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,86,244 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.
దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ మెరుగుపడుతోంది. గత 14 రోజులతో సరిపోలిస్తే ఈ రేటు 63శాతం నుంచి 67శాతానికి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 67.19%గా ఉండగా.. మరణాల రేటు 2.09%గా ఉంది. అలాగే, దేశంలో యాక్టివ్ కేసులు 30.72 %గా ఉన్నాయి. ఇకపోతే కరోనా టెస్ట్‌లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 1366 ల్యాబోరేటరీల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 6,19,652 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,14,84,402 మంది నుంచి శాంపిల్స్ పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
దేశంలో తొలిసారి లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రికవరీ రేటు ఇలా..
దేశంలో 19 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై ఇన్ఫోగ్రాఫ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
WhatsApp: ఒక్క స్వైప్‌తో వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్!
-
Politics News
Bandi Sanjay: భాజపా-తెరాస కార్యకర్తల ఘర్షణ.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
-
Sports News
Independence Day : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ.. మెగా ఈవెంట్లలో భారత క్రీడాలోకం ఇలా..!
-
General News
Independence Day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
-
Movies News
Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
-
India News
Indian flag: అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం