సివిల్స్‌ పరీక్ష వాయిదా పిటిషన్‌ కొట్టివేత

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4న యథాథంగా జరగనుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలని...

Updated : 30 Sep 2020 15:32 IST

దిల్లీ: సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4న యథాతథంగా జరగనుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలని యూపీఎస్సీకి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే చివరిసారి పరీక్ష రాస్తున్న వారి విషయంలో కీలక సూచన చేసింది. కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాకపోతే వారికి మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని యూపీఎస్సీకి సూచించింది.

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని 20 మంది యూపీఎస్సీ ఆశావహులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై యూపీఎస్సీ తాజాగా పరీక్ష వాయిదా వేసే ప్రసక్తే లేదని తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ ఏడాది పరీక్షలు వాయిదా వేస్తే ఆ ప్రభావం వచ్చే ఏడాది జరిగే పరీక్షలపై పడుతుందని పేర్కొంది. దీంతో యూపీఎస్సీ వాదనను సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. అక్టోబర్‌ 4న జరిగే పరీక్షకు ఇప్పటికే యూపీఎస్సీ అన్ని ఏర్పాట్లూ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని