అమెరికాలో కుప్పకూలిన విమానం

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం రోడ్డుపై కుప్పకూలింది. పెంబ్రోక్‌ పైన్స్‌లోని నార్త్‌ పెర్రీ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు....

Published : 17 Mar 2021 01:22 IST

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం రోడ్డుపై కుప్పకూలింది. పెంబ్రోక్‌ పైన్స్‌లోని నార్త్‌ పెర్రీ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్‌ సమయంలో తలెత్తిన లోపంతో విమానం రోడ్డుపై వెళుతున్న కారుపై పడింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మహిళ, ఓ చిన్నారి గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. విమానాశ్రయం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ప్రమాద ధాటికి విమానంలోని ఇంధనం లీక్‌ కాగా రోడ్డుపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని