PETA: అక్టోబరు 2ను ‘జాతీయ మాంసాహారరహిత దినం’గా ప్రకటించాలి

గాంధీ జయంతి అక్టోబరు 2ను ‘జాతీయ మాంసాహార రహిత దినం’గా ప్రకటించాలని జంతు పరిరక్షణ సంస్థ ‘పీపుల్‌ ఆఫ్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌(పెటా)’ కేంద్రానికి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా ఓ...

Updated : 15 Oct 2022 16:48 IST

ప్రధాని నరేంద్ర మోదీకి ‘పెటా ఇండియా’ లేఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాంధీ జయంతి అక్టోబరు 2ను ‘జాతీయ మాంసాహార రహిత దినం’గా ప్రకటించాలని జంతు హక్కుల సంస్థ ‘పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌(పెటా)’  డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా ఓ లేఖ రాసింది. మహాత్ముడి అహింసా మార్గానికి గౌరవసూచకంగా ఈ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శాకాహారిగా ఉండటాన్ని గాంధీ ఒక నైతిక సూత్రంలా పాటించారని సదరు లేఖలో గుర్తుచేసింది. ఇదే స్ఫూర్తిని దేశ ప్రజలూ అనుసరించేలా ప్రోత్సహించడం ద్వారా ఆయా జంతువులను హింస నుంచి రక్షించవచ్చని పెటా ఇండియా సీఈఓ డా.మణిలాల్‌ తెలిపారు. ఈ సంప్రదాయాన్ని ప్రారంభించడమనేది గాంధీ ఆశయాలకు నివాళి అర్పించడం లాంటిదేనన్నారు. శాకాహార వినియోగం.. అనారోగ్య సమస్యలను దూరం చేయడంతోపాటు గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడటంలోనూ సహాయపడుతుందని పేర్కొన్నారు. మాంసాహారాన్ని వదిలేయడం అనేది ఇతర జీవులు, భూమి, మన సొంత శరీరాల పట్ల భక్తిభావాన్ని ప్రదర్శించడం లాంటిదేనని ‘పెటా ఇండియా’ వీగన్‌ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ అహుజా అన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన, రుచికరమైన శాకాహారాన్ని తీసుకుంటూ, మహాత్మా గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేలా పెటా ప్రోత్సహిస్తోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని