Ashok Gehlot: అసెంబ్లీలో పాత బడ్జెట్ చదివిన రాజస్థాన్ సీఎం..!
శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీలో చిత్రమైన పరిస్థితి ఎదురైంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(Ashok Gehlot).. తొలుత పాత ప్రతులను చదివారు.
జైపుర్: రాజస్థాన్(Rajasthan ) ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(Ashok Gehlot) ప్రవేశపెట్టిన బడ్జెట్ అసెంబ్లీలో గందరగోళానికి దారితీసింది. ఆయన గతేడాది పద్దులోని విషయాలనే ఈ సారి కూడా చదవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు ఆయన గత ఆర్థిక సంవత్సరానికి చెందిన గణాంకాలనే చదివారు. కాంగ్రెస్ మంత్రి ఒకరు ఈ తప్పిదాన్ని గుర్తించి ప్రసంగాన్ని ఆపించారు.
సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gehlot) వద్దే ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ఆయనే అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతులను చదవడం ప్రారంభించిన ఆయన.. పాత పథకాలు, గత ఏడాది అమలు చేసిన పట్టణాభివృద్ధి ప్రణాళికలను ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రి మహేశ్ జోషి ఈ విషయాన్ని గుర్తించి, సీఎంకు తెలియజేశారు. ఈ పరిణామంతో భాజపా సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొత్త పద్దులోని విషయాలు లీక్ అయ్యాయా..? అని నిలదీశారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ‘ఎనిమిది నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్‌ను చదివారు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. నేను సీఎంగా ఉన్నప్పుడు.. ఒకటికిరెండుసార్లు ప్రతులను పరిశీలించుకునేదాన్ని. ఇలా పాత బడ్జెట్‌ను చదివేవారి చేతిలో రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉంటుందో మీరే ఊహించుకోగలరు’ అని మాజీ సీఎం వసుంధరా రాజే విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందని, గహ్లోత్ క్షమాపణలు చెప్పాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘నేను చదువుతున్న ప్రతులకు, మీ చేతిలో ఉన్న ప్రతుల్లోని అంశాలకు తేడా ఉంటే మీరు లేవనెత్తాలి. ఆ పాత పత్రాలను చూసుకునేందుకు తెచ్చాను. ఇక్కడ ఎలాంటి లీక్ జరగలేదు. భాజపా(BJP) తన చెత్త రాజకీయాలకు బడ్జెట్‌ను కూడా వదిలిపెట్టదని దీన్నిబట్టి తెలుస్తోంది. రాజస్థాన్ అభివృద్ధికి ఒకేఒక్క అవాంతరం భాజపా మాత్రమే’ అని తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. నిరసనల అనంతరం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..