traffic rules: 270 సార్లు ట్రాఫిక్‌ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా

బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Published : 17 Apr 2024 18:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. హెల్మెట్‌ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్‌ మొదలైన ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆమెకు రూ.1.36 లక్షలు జరిమానా విధించినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన అనేక సీసీటీవీ కెమెరాల్లో ఆ మహిళ ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినట్లు వీడియోలు రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను, జరిమానాలను కట్టవలసిందిగా ఆమెకు వరుసగా నోటీసులు పంపారు. 

ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి

గతంలోను నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై  కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించామని, అయినా ప్రజల్లో మార్పు రావట్లేదని పోలీసు జాయింట్ కమిషనర్ ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఇటీవల, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ ద్విచక్ర వాహన యజమానిపై కేసు నమోదు చేసి రూ.3.2 లక్షల జరిమానా విధించామని ఆయన అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన 2,681 వాహనదారుల నుంచి ఇప్పటి వరకు రూ.50,000లకు పైగా జరిమానాలను సేకరించినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని