UCC: మళ్లీ అధికారంలోకి రాగానే యూసీసీ అమలు చేస్తాం : పీయూష్‌ గోయల్‌

మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code)ని అమలుచేస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Published : 15 Apr 2024 19:14 IST

ముంబయి: మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code)ని అమలుచేస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. భాజపా మేనిఫెస్టోపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చిన ఆయన.. అది వారి ఓటమి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ముంబయి నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న గోయల్‌.. మహారాష్ట్ర భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘‘దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు భాజపా కట్టుబడి ఉంది. దాన్ని తప్పక అమలుచేస్తాం. ఇప్పటికే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం దానిపై ముందుకువెళ్తోంది. మేం చేసే ప్రతీ పనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అసాధ్యం అనుకున్న పనులను మోదీ సుసాధ్యం చేశారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మితమైంది. 370 రద్దు, త్రిపుల్‌ తలాక్‌పై నిషేధం కోసం పార్లమెంటులో తమ మెజార్టీని ఉపయోగించుకున్నాం. అంతేకానీ, రాజ్యాంగాన్ని మార్చేందుకు కాదు’’ అని గోయల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని