Border Boy: ఎట్టకేలకు ఇంటికి చేరిన బోర్డర్‌ బాయ్‌

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జన్మించిన శిశువు ఎట్టకేలకు ఇంటికి చేరాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన హిందూదంపతులు బలమ్‌రామ్, నింబోదేవి..

Published : 12 Dec 2021 01:28 IST

ఇస్లామాబాద్‌: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జన్మించిన శిశువు ఎట్టకేలకు ఇంటికి చేరాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన హిందూదంపతులు బలమ్‌రామ్, నింబోదేవి.. పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత్ వచ్చారు. రెండోదశ కరోనా కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించటంతో వీరు సరిహద్దులోనే చిక్కుకుపోయారు. ఆంక్షలు సడలించిన తర్వాత వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. వీసా గడువు ముగియడంతో కుదరలేదు. దీంతో అట్టారీ-వాఘా సరిహద్దులో ఉన్న రిసార్టులోనే వారు ఉండిపోయారు. ఓ ఎన్జీవో వారికి వీసాలు, అవసరమైన పత్రాలు సమకూర్చటంలో సాయం అందించింది. వీసాలు, ధ్రువీకరణ పత్రాలు లభించడంతో.. బలమ్‌రామ్ దంపతులు బిడ్డతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. నింబోదేవి ఈనెల 2న మగబిడ్డకు జన్మనిచ్చింది.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని