29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ - 2021-22ని సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు.........

Updated : 14 Jan 2021 21:38 IST

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ - 2021-22ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం గురువారం ప్రకటన జారీచేసింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకు (20 రోజుల పాటు) విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కానున్న ఈ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 8తో ముగిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ సమావేశాలు ప్రారంభం రోజున ఉదయం 11గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం అనంతరం ఎకనమిక్‌ సర్వేను విడుదల చేయనున్నారు. 

సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తర్వాత మళ్లీ ఉభయ సభలు భేటీ కావడం ఇదే తొలిసారి. అప్పుడు ఏడు రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరిగాయి. పలువురు ఎంపీలకు కరోనా వైరస్‌ సోకవడంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నవంబర్‌ - డిసెంబర్‌లో జరగాల్సిన శీతాకాల సమావేశాలు కూడా నిర్వహించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

జ్యోతి దర్శనం.. శరణం అయ్యప్ప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని