ఆ ఉద్యోగులంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలి: కేంద్రం 

రోజురోజుకూ పెరుగుతన్న కరోనా కేసులను తగ్గించేందుకు 45 ఏళ్లు పైబడిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా 

Published : 07 Apr 2021 01:22 IST

దిల్లీ: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను తగ్గించేందుకు 45 ఏళ్లు పైబడిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని కేంద్రం కోరింది. టీకా వేసుకున్న తర్వాత కూడా ఎప్పటిలాగే యాంటీ-కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటించాలని సూచించింది.

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ రెండోది కాగా, సోమవారం దేశవ్యాప్తంగా లక్షకు పైగా కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. నేటి గణాంకాల ప్రకారం దేశంలో 96,982 కేసులు నమోదుకాగా, 442 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ ఎనిమిది కోట్ల మంది టీకా వేయించుకున్నారు. వైరస్‌ ప్రభావం ఎక్కువ అవుతున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. 

మహారాష్ట్రలో ప్రతిరోజూ 50 వేల మంది కరోనా బారిన పడుతున్నారు. నేడు కొత్తగా 47,288 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పెద్దవాళ్లకు ప్రత్యేకమైన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రవేశపెట్టాలని దిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు. కరోనాను కట్టడి చేయడానికి దిల్లీ, మహారాష్ట్రల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతంలో లాక్‌డౌన్‌, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటలవరకూ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని