kendriya Vidyalayas: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు: కేంద్రం

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ

Updated : 13 Apr 2022 16:56 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల) కోటా కింద కేటాయించే ప్రత్యేక సీట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేవీఎస్‌ కేటాయిస్తూ వస్తోంది. అయితే, ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఓవైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని