Partha Chatterjee: పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ కస్టడీ పొడిగింపు

తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి కోర్టు మరో రెండు రోజులపాటు ఈడీ కస్టడీని పొడిగించింది.........

Published : 03 Aug 2022 23:14 IST

కోల్‌కతా: పాఠశాల ఉద్యోగుల నియామకం కుంభకోణంలో అరెస్టయి తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee), ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి (Arpita Mukherjee) కోర్టు మరో రెండు రోజులపాటు ఈడీ కస్టడీని పొడిగించింది. ఆగస్టు 5వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఛటర్జీకి మరో నాలుగు రోజులు, అర్పితాకు మూడు రోజుల కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరగా.. ఇద్దరికి రెండ్రోజుల కస్టడీని విధిస్తూ తీర్పు వెలువడించింది.

2014-2021 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా బెంగాల్‌ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు..  ఆయన సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్యల నివాసాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అర్పిత నివాసాల్లో సోదాలు జరపగా.. రూ.50కోట్లకుపైగా విలువైన కరెన్సీ నోట్ల కట్టలు, భారీగా బంగారం, కీలక దస్త్రాలను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. వారిని ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని