ED Summons: దీదీ మేనల్లుడికి ఈడీ మరోసారి సమన్లు

తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది.......

Updated : 02 Sep 2021 22:24 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది. బొగ్గు కుంభకోణం వ్యవహారంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్‌ కేసులో అభిషేక్‌తో పాటు ఆయన సతీమణికి కూడా నోటీసులు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి ఎదుట సెప్టెంబర్‌ 6న విచారణకు హాజరు కావాలని అభిషేక్‌కు ఈడీ సూచించింది. అలాగే, ఆయన సతీమణి రుజిరాకు కూడా సమన్లు జారీచేసిన ఈడీ.. సెప్టెంబర్‌ 1న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వచ్చే నెలలో వేర్వేరు తేదీల్లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈస్ట్రర్న్‌ కోల్డ్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌కు చెందిన గనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై గతేడాది సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. ఈ కేసు దర్యాప్తును ఈడీ ప్రారంభించింది.  ఈ కుంభకోణంలో అభిషేక్‌ బెనర్జీ లబ్ధిపొందారని ఈడీ ఆరోపించింది. ఆ ఆరోపణల్ని ఆయన ఇప్పటికే ఖండించారు. అభిషేక్‌ ప్రస్తుతం  డైమండ్‌ హార్బర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని