BSF: అందుకే బీఎస్‌ఎఫ్‌ పరిధిని పెంచాం.. కేంద్ర మంత్రి వెల్లడి

పంజాబ్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు పంజాబ్‌, పశ్చిమ బెంగాలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు...

Published : 07 Dec 2021 23:25 IST

దిల్లీ: పంజాబ్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు పంజాబ్‌, పశ్చిమ బెంగాలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాలూ చేశాయి. ఇదే విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో బీఎస్‌ఎఫ్ అధికార పరిధిని పొడిగించడం.. సంబంధిత సిబ్బంది తమ విధులను మరింత సమర్థంగా నిర్వర్తించేందుకేనని అన్నారు.

‘డైనమిక్‌ రిమోట్లీ ఆపరేటెడ్‌ నావిగేషన్‌’ సాంకేతికతతో ఆపరేట్‌ అయ్యే డ్రోన్లవంటి కార్యకలాపాలు పెరగడం కూడ ఇందుకు ఓ కారణమని కేంద్ర మంత్రి చెప్పారు. బీఎస్‌ఎఫ్ సైతం తమ అధికార పరిధి పెంపుతో సంబంధిత రాష్ట్రాల పోలీసులకూ ప్రయోజనం చేకూరుతుందని ఇదివరకు తెలిపింది. తాము ఎవరిని అదుపులోకి తీసుకున్నా, దేనిని స్వాధీనం చేసుకున్నా.. రాష్ట్ర పోలీసులకు లేదా చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ఉన్న ఏజెన్సీకి అప్పగించాల్సి ఉంటుందని బీఎస్ఎఫ్‌ ఈస్ట్రన్‌ కమాండ్‌ కేంద్ర కార్యాలయం ఏడీజీ వై.బి.ఖురానా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని