Devendra Fadnavis: కళ్లముందే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లాం.. మర్చిపోయారా..!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంపై మండిపడ్డారు. తాము ఎవరికీ భయపడమన్నారు. 

Updated : 31 Dec 2022 12:24 IST

నాగ్‌పుర్‌: మీ ఇద్దరిని చూసి, భాజపా భయపడదని శివసేన నేత ఆదిత్య ఠాక్రే( Aaditya Thackeray), ఆయన తండ్రి ఉద్ధవ్‌ ఠాక్రే( Uddhav Thackeray)పై మహారాష్ట్ర(Maharashtra) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis) విరుచుకుపడ్డారు. 32ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కౌంటర్  ఇచ్చారు. 

‘నిన్ను చూసే కాదు.. నీ తండ్రిని చూసి కూడా ఇక్కడెవరూ భయపడటం లేదు. మీ కళ్లముందు నుంచే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి.. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. అప్పుడు ముంబయి కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు’ అని ఫడణవీస్ తీవ్రస్థాయిలో మాట్లాడారు. అలాగే సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో జరిగిన అక్రమాలపై నెలరోజుల్లో విచారణ పూర్తిచేస్తామని వెల్లడించారు.

ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో కొద్దినెలల క్రితం మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. 40 మందికిపైగా ఎమ్మెల్యేలతో శిందే (Eknath Shinde) తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం భాజపా మద్దతుతో శిందే సీఎం అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని