పట్టాలెక్కిన రెండో ప్రైవేటు రైలు

భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌.. రెండో మార్గంలో అందుబాటులోకి వచ్చింది. అహ్మదాబాద్‌-ముంబయి మార్గంలో తేజస్‌ రైలును గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ

Updated : 17 Jan 2020 15:40 IST

అహ్మదాబాద్‌: భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌.. రెండో మార్గంలో అందుబాటులోకి వచ్చింది. అహ్మదాబాద్‌-ముంబయి మార్గంలో తేజస్‌ రైలును గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్‌ నుంచి ఆరున్నర గంటల్లో ఈ రైలు ముంబయి చేరుకోనుంది. కాగా.. జనవరి 19 నుంచి రైలు వాణిజ్యపరంగా సేవలను అందించనుంది. 

తేజస్‌ రైలు ప్రారంభోత్సవానికి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ హాజరుకావాల్సి ఉండగా.. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో రాలేదని భాజపా ఎంపీ కిరిట్‌ సోలంకీ తెలిపారు. ఈ రైలు తమ రాష్ట్రానికి గర్వకారణమని, దీని ద్వారా మహారాష్ట్ర, గుజరాత్‌ లబ్ధి పొందుతాయని విజయ్‌ రూపానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే మార్గంలో బుల్లెట్‌ రైలు కోసం పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం దిల్లీ-లఖ్‌నవూ మధ్య తేజస్‌ రైలు నడుస్తోన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 4న ఈ తొలి ప్రైవేటు రైలును ప్రారంభించారు. తొలిసారిగా భారత రైల్వే శాఖ కాకుండా, దాని అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో తేజస్‌ను నడుపుతున్నారు. అధునాతన సౌకర్యాలు, హంగులతో ఈ రైలును తీసుకొచ్చారు. తాజాగా అహ్మదాబాద్‌-ముంబయి మార్గంలోనూ తేజస్‌ను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్ల ఆధ్వర్యంలో నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని