చైనా  పర్యాటకులకు ఈ-వీసాలు రద్దు

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల విషయంలో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం మరింత అప్రమత్తతో..........

Published : 03 Feb 2020 01:27 IST

భారత రాయబార కార్యాలయం తాత్కాలిక నిర్ణయం

బీజింగ్‌: చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల విషయంలో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం మరింత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా తాత్కాలికంగా ఆన్‌లైన్‌ వీసాలను రద్దు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఈ ప్రాణాంతక మహమ్మారి సృష్టించిన కల్లోలానికి ఇప్పటికే  300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 14,562 మంది ఈ వైరస్‌కు ప్రభావితమయ్యారు. ప్రస్తుతం ఈ వైరస్‌ భారత్‌, అమెరికా, యూకేతో పాటు మొత్తం 25 దేశాలకు విస్తరించింది. 

చైనాలో నెలకొన్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్‌ వెళ్లేందుకు ఈ-వీసాల మంజూరును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. చైనా పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారితో పాటు చైనాలో నివసిస్తున్న విదేశీయులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఈ -వీసాలు జారిచేసిన వారికి కూడా అవి చెల్లవంటూ సమాచారం అందించినట్టు ప్రకటనలో పేర్కొంది.  ఎవరైనా కచ్చితంగా భారత్‌కు వెళ్లాల్సి ఉంటే మాత్రం అందుకు తగిన కారణాలతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది.

ఇదీ చదవండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని