కొవిడ్‌పై ఫైట్‌లో రియల్‌ హీరోలు!

చైనాలోని హువాన్‌లో మృత్యు నాదం చేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను తరిమికొట్టే పోరాటంలో అక్కడి వైద్య సిబ్బంది సాహసోపేతంగా పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ నిత్యం కరోనా బాధితులకు అందుబాటులో ఉండి వైద్యసేవలందిస్తున్నారు..........

Updated : 12 Feb 2020 18:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలోని వుహాన్‌లో మృత్యునాదం చేస్తున్న ప్రాణాంతక కోవిడ్‌-19 (కరోనా వైరస్‌)ను తరిమికొట్టే పోరాటంలో అక్కడి వైద్య సిబ్బంది సాహసోపేతంగా పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ బాధితులకు వైద్యసేవలందిస్తున్నారు. దేశ పౌరులను కాపాడుకొనేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇందుకోసం కేవలం తమ సమయాన్ని మాత్రమే త్యాగం చేయడం కాదు.. బాధితులకు వైద్య సేవలందించే క్రమంలో తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తూ నిజమైన హీరోలు అని నిరూపించుకుంటున్నారు. తల నుంచి సహజసిద్ధంగా రాలే వెంట్రుకల ద్వారా కోవిడ్‌-19 ఒకరి నుంచి మరొకరికి ఎక్కడ వ్యాపిస్తోందనని చైనాలోని నర్సులు తమ శిరోజాలను సైతం తొలగించుకుంచుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. శిరోజాల తొలగింపు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. 

చైనాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకూ పెరగడంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. నిద్ర కూడా సరిగా లేకపోవడంతో చాలామంది వైద్యులు, నర్సులు ఆస్పత్రిలోని కుర్చీలు, బెంచీల పైనే కాసేపు ఒరిగి సేదతీరుతున్నారు. మరోవైపు చైనాలో కోరలు చాచిన కరోనా వైరస్‌ ఇప్పటివరకు 1100 మందికి పైగా ప్రాణాల్ని బలితీసుకుంది. వుహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. దీని ప్రభావంతో చైనాలో 43 వేల మందికి పైగా బాధపడుతున్నారు.

 

చైనా నగరాలు.. ఎటుచూసినా ఖాళీయే!

నిత్యం జనసంచారంతో నిండిపోయి కిటకిటలాడే చైనాలోని పలు నగరాల వీధులన్నీ కోవిడ్‌-19 దెబ్బకు బోసిపోయాయి. ఎడారిని తలపించేలా మారాయి. జనం బయటకు వచ్చేందుకే భయపడటంతో రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అనేక పరిశ్రమలు మూసివేయడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది.  


ఓ పోలీసు అధికారి మాస్క్‌ ధరించి నడుస్తున్న ఈ ప్రాంతం ఓరియంటల్‌ పెరల్‌ టవర్‌. కరోనా దెబ్బతో బోసిపోయింది. షాంఘై నగర పరిధిలోని లిజియాజుయి వద్ద పరిస్థితి ఇలా..

వుహాన్‌లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్న వైనం..

నిత్యం జన సంచారంతో కోలాహలంగా ఉండే జియుజియాంగ్‌లోని షాపింగ్‌ స్ట్రీట్‌లో పరిస్థితి ఇలా..


కోవిడ్‌-19 నుంచి రక్షణగా మాస్క్‌ ధరించి బోసిపోయిన బీజింగ్‌ వీధుల్లో ఓ వ్యక్తి ఇలా..

వుహాన్‌లో ఓ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ఇలా బెడ్‌లు వేసి ఆస్పత్రిగా మార్చిన దృశ్యం.. 

షాంఘై నగరంలో నిత్యం జనప్రవాహంతో ఉండే వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లున్న ప్రాంతం ఇలా.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని