ట్రంప్‌ ‘చైనా వైరస్‌’ వ్యాఖ్యకు సరైన జవాబు?

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)ను ‘చైనా వైరస్‌’ అని సంబోధించటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే తాను ఆ విధంగా అనటం సమంజసమే అని ట్రంప్‌ సమర్థించుకున్నారు. కాగా, ట్రంప్‌

Published : 19 Mar 2020 01:36 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)ను ‘చైనా వైరస్‌’ అని సంబోధించటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే తాను ఆ విధంగా అనటం సమంజసమే అని ట్రంప్‌ సమర్థించుకున్నారు. కాగా, ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసిన రోజే, ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో వైరస్‌లను గురించి ఓ ట్విటర్‌ ప్రకటన చేసింది. ‘‘దయచేసి త్వరగా అర్థంచేసుకోండి...  వైరస్‌లకు జాతి భేదాలు లేవు.’’ అంటూ యునెస్కో తన పోస్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ‘‘కరోనా వ్యతిరేక పోరాటానికి కావాల్సింది శాస్త్రీయ అవగాహన, అపోహలు కాదు. నిజాలు కావాలి, భయాలు కాదు. మనం ఏకమైతే కొవిడ్‌-19ను జయించగలం.’’ అని హితవు పలికింది. అయితే యునెస్కో చేసిన  ప్రకటన ట్రంప్‌ వ్యాఖ్యకు సరయిన సమాధానం ఇచ్చినట్టయింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షలకు చేరువ కాగా 7,510 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. భారత్‌ విషయానికి వస్తే తాజా సమాచారం ప్రకారం దేశంలో 153 మందికి కొవిడ్‌-19 సోకగా, ముగ్గురు మృతిచెందారు. కాగా, చైనాలో కొవిడ్‌-19 చాలావరకూ అదుపులోకి వచ్చింది. కరోనా చికిత్సకు తాము వాడుతున్న ఫావిపిరావర్‌ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తోందని, రోగులు కోలుకుంటున్నారని చైనా అధికారులు అంటున్నారు. అంతేకాకుండా కరోనాకు టీకాను సిద్ధంచేసే పరిశోధనలు అక్కడ త్వరిత గతిన సాగుతున్నాయి.


 


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని