కొవిడ్‌-19పై పోరుకు విదేశీ విరాళాలు?

కరోనా మహమ్మారిపై పోరుకు మోదీ ప్రభుత్వం విదేశీ విరాళాలు స్వీకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో....

Published : 01 Apr 2020 21:50 IST

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరుకు మోదీ ప్రభుత్వం విదేశీ విరాళాలు స్వీకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొవిడ్‌-19పై పోరుకు ఏర్పాటైన పీఎం-కేర్స్‌కు వచ్చే విదేశీ విరాళాలను స్వాగతించేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

కొవిడ్‌పై పోరుకు అవసరమయయ్యే వెంటిలేటర్లు, ఎన్‌95 మాస్కులు, 3 లేయర్ల మాస్కులు వంటివి అందించాలని వివిధ దేశాల్లోని భారత రాయబారులు ఆయా దేశాలను కోరుతున్నారు. వ్యాక్సిన్లు కూడా అందించాలని కోరినట్లు సమాచారం. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1400 దాటగా..38 మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని