నిందితులను కఠినంగా శిక్షించండి

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఇద్దరు సాధువుల హత్య కేసుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడారు. సాధువుల హత్యపై సంఘీభావం వ్యక్తం చేస్తూ..

Published : 28 Apr 2020 20:28 IST

ఆదిత్యనాథ్‌ను కోరిన ఉద్ధవ్‌ఠాక్రే

ముంబయి: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఇద్దరు సాధువుల హత్య కేసుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడారు. సాధువుల హత్యపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇలాంటి దుశ్చర్యలను సహించరాదని, హత్యతో సంబంధం ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదిత్యనాథ్‌ని కోరారు. ఈ ఘటనకు మతపరమైన రంగు పులుముకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడుతూ..‘ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి, బులంద్‌షహర్‌లో ఇద్దరు సాధువుల హత్యపై ఆవేదన వ్యక్తం చేశాను. గతంలో మాకు ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు మేము ధైర్యంగా వ్యవహరించాం. మీరు కూడా అదే విధంగా చేయాలి. నిందితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఈ ఘటనకు మతపరమైన రంగు పులుముకోకుండా చూడాలని కోరుతున్నా’ అని ఆయనతో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బులంద్‌షహర్‌ జిల్లాలోని ఓ దేవాలయంలో ఇద్దరు సాధువుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని కర్రలతో కొట్టి చంపిన నిందితుడిని అరెస్టు చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని