భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ!

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం తతెత్తింది. ఈ ఘటనలో కొంతమంది సైనికులకు స్వల్ప గాయాలు చోటుచేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు........

Published : 11 May 2020 00:49 IST

చర్చలతో సద్దుమణిగిన వివాదం

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం తతెత్తింది. ఈ ఘటనలో కొంతమంది సైనికులకు స్వల్ప గాయాలైనట్లు ఓ అధికారి తెలిపారు. సిక్కింలోని నకులా సెక్టార్‌లో శనివారం ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. మొత్తం 150 మంది సైనికులు ఒకరికొకరు తలపడ్డట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. దీంతో చైనాకు చెందిన ఏడుగురు, భారత్‌ వైపు నలుగురు సైనికులకు గాయాలైనట్లు పేర్కొన్నాయి. రోజువారీ గస్తీలో భాగంగా ఇరువైపుల వారు తారసపడ్డప్పుడు ఘర్షణ తలెత్తినట్లు తెలిపాయి. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నట్లు వెల్లడించాయి. 

చివరిసారి సెప్టెంబరు 2019లో తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని పాంగోంగ్‌ సో సరస్సు తీరంలో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. కానీ, తర్వాత చర్చల ద్వారా వివాదం వెంటనే సద్దుమణిగింది. అంతకుముందు డోక్లాంలో 2017లో సుదీర్ఘంగా 73 రోజుల పాటు ఇరు దేశాల బలగాలు మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే. భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లాంలో రహదారిని చైనా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ.. భూటాన్‌కు మద్దతుగా భారత సైనిక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దీన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టకేలకు విస్తృత దౌత్యపరమైన చర్చల అనంతరం ఇరుదేశాలు వెనక్కి తగ్గాయి. దీంతో వివాదం సద్దుమణిగినా.. డోక్లాం సమస్యకు మాత్రం ఇంకా పూర్తి స్థాయి పరిష్కారం లభించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని