
హాంగ్‌కాంగ్‌లో భారీ ఆందోళన
హాంగ్‌కాంగ్: చైనా ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం హాంగ్‌కాంగ్‌లో భారీ ఆందోళన జరిగింది. నిరసనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును, జలఫిరంగులను ప్రయోగించారు. ఆందోళన చేయకుండా వెళ్లిపోవాలంటూ తొలుత పోలీసులు నీలం రంగు జెండాలను ప్రదర్శించారు. అయినా వినకపోవడంతో తొలుత బాష్పవాయువును, అనంతరం జల ఫిరంగులను వినియోగించారు. ఈ సందర్భంగా 120 మందిని అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.