సరిహద్దు సమస్యపై చర్చలకు సిద్ధం: నేపాల్

భారత్‌తో సరిహద్దు వివాదాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నేపాల్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్‌ కుమార్‌...

Published : 10 Jun 2020 01:24 IST

ఖాట్‌మాండు: భారత్‌తో సరిహద్దు వివాదాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నేపాల్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యావాలీ నేపాల్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ‘‘సమస్యను పరిష్కరించుకునేందుకు సమావేశం నిర్వహించాలని భారత్‌ను కోరాం. త్వరలోనే దీనిపై రెండు దేశాల మధ్య సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నాం. చర్చల ద్వారానే ఈ వివాదం పరిష్కారం అవుతుందని నేపాల్ భావిస్తోంది. ఇంతకు మించి మరో పరిష్కార మార్గం అవసరంలేదని నా అభిప్రాయం. అలానే మేము ఏ ఇతర భూభాగాలు ఆశించటంలేదు’’ అని గ్యావాలీ తెలిపారు. 

టిబెట్‌లోని మానస సరోవర పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత్‌ నిర్మించిన మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. అలానే భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ రూపొందించింది. అయితే నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చరిత్రాత్మక ఆధారాలు లేవని భారత్ స్పష్టం చేసింది. భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతకు గౌరవించి ఆ మ్యాప్‌ను ఉపసంహరించుకోవాలని కోరింది. అలానే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని కోరింది. ఈ నేపథ్యంలో నేపాల్ కూడ అందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు