దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా దళాలు 

భారత దళాల నైతిక  స్థైర్యం అత్యున్నత స్థితిలో ఉందని.. దేశం కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమైపోయారని ఇండో-టిబేటియన్‌ బోర్డర్‌ పోలీస్‌ అధిపతి ఎస్‌ఎస్‌ దేశ్‌వాల్‌ పేర్కొన్నారు.

Published : 06 Jul 2020 01:30 IST

ఐటీబీపీ డీజీ

న్యూదిల్లీ: భారత దళాల నైతిక  స్థైర్యం అత్యున్నత స్థితిలో ఉందని.. దేశం కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమైపోయారని ఇండో-టిబెటియన్‌ బోర్డర్‌ పోలీస్‌ అధిపతి ఎస్‌ఎస్‌ దేశ్‌వాల్‌ పేర్కొన్నారు. చైనాతో లద్దాక్‌లో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన ఆదివారం స్పందించారు. ఇటీవల ప్రధాని లద్దాఖ్‌కు వచ్చి ప్రసంగించడం దళాల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు.

‘‘జాతీయ నాయకత్వం, రాజకీయ నాయకత్వం, జవాన్లు, దళాలు దేశానికి అంకితమయ్యారు. వారు సరిహద్దు రక్షణకు అంకితమయ్యారు. వాయుసేన, భారత సైన్యం, ఐటీబీపీ సహా ఇతర దళాల్లో నైతికస్థైర్యం అత్యున్నత స్థాయిలో ఉంది’’ అని దేశ్‌వాల్‌ పేర్కొన్నారు. దిల్లీలో డీఆర్‌డీవో నిర్మించిన 10,000 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని ఐటీబీపీ నిర్వహిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని