కొనసాగుతున్న చైనా బలగాల ఉపసంహరణ

భారత్-చైనా సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ రెండో రోజు కొనసాగినట్లు  భారత సైనిక వర్గాలు తెలిపాయి..

Published : 08 Jul 2020 00:38 IST

లద్దాఖ్: భారత్-చైనా సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ రెండో రోజూ కొనసాగినట్లు  భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ ప్రాంతాల నుంచి చైనా బలగాలు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయని వెల్లడించాయి. అలానే గోగ్రా ప్రాంతంలో కూడా చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు పేర్కొన్నాయి. భారత్ కూడా ఈ మూడు ప్రాంతాల నుంచి తన బలగాలను ఉపసంహరించినట్లు సైన్యం వెల్లడించింది.

అయితే ఆయా ప్రాంతాల్లో నిఘా కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించడంపై రెండు వారాల్లో జరగనున్న సైనిక చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య జరిగిన అంగీకారం మేరకు చైనా గల్వాన్‌లోని పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి తన సామగ్రిని పూర్తిగా తొలగించింది. చైనా ఉపసంహరణను ద్రువీకరించేందుకు భారత్ సైనిక వర్గాలు పూర్తిస్థాయిలో తనిఖీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాంగాంగ్‌ ప్రాంతంలో ఫింగర్‌ 4 వద్ద మాత్రం స్వల్పంగా చైనా తన బలగాలను ఉపసంహరించినట్లు సమాచారం.

ఇవీ చదవండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని