Third wave: మూడో దశకు అవకాశాలు తక్కువే

భారత్‌లో కరోనా మూడో ఉద్ధృతి రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్‌ అధ్యయనపత్రం వెల్లడించింది. ఒక వేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది.  

Updated : 23 Feb 2024 17:08 IST

ఈనాడు, దిల్లీ: భారత్‌లో కరోనా మూడో ఉద్ధృతి రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్‌ అధ్యయనపత్రం వెల్లడించింది. ఒక వేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది.  ఇప్పటి పరిస్థితులను, రాబోయే ఉద్ధృతులను ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపింది. ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ, వైద్యనిపుణులు సందీప్‌ మండల్‌, సమీరన్‌ పండా, లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన నిమలన్‌ అరినమిన్‌పతి సంయుక్తంగా రూపొందించిన ఈ అధ్యయన పత్రం ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌లో ప్రచురితమైంది. రోగనిరోధకశక్తి క్షీణించడం, రోగనిరోధకశక్తిని తప్పించుకొనేలా వైరస్‌లో మార్పులు రావడం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని ఇందులో అభిప్రాయపడ్డారు. రెండు సందర్భాల్లోనే మూడో ఉద్ధృతి తలెత్తడానికి ఆవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 1. కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో అది రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగాలి. 2. సంక్రమణాన్ని తగ్గించగలిగే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలి. ఈ రెండు కారణాల వల్ల ఒక వేళ మూడో వేవ్‌ వచ్చినప్పటికీ అది రెండో వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వీరు అధ్యయన పత్రంలో అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని