UnderWater Metro: హుగ్లీ నీటి అడుగున మెట్రో సొరంగం
దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం పశ్చిమబెంగాల్‌లో సిద్ధమవుతోంది.
ప్రయాణికులకు 45 సెకన్ల వింత అనుభూతి
హావ్‌డా/కోల్‌కతా: దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం పశ్చిమబెంగాల్‌లో సిద్ధమవుతోంది. కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలుమార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మిస్తున్నారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు వింత అనుభూతిని అందించనుంది. సొరంగ అంతర్గత అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్-ప్యారిస్ కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా రూపుదిద్దుకొంటున్న ఈ సొరంగమార్గం నదీగర్భానికి 13 మీటర్ల దిగువన, భూమట్టానికి 33 మీటర్ల దిగువన ఉంటుంది. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా దీన్ని ప్రారంభిస్తారు. ‘ఈస్ట్ వెస్ట్ కారిడార్‌కు ఈ సొరంగ నిర్మాణం చాలా కీలకం. చుట్టూ ఉన్న నివాసప్రాంతాలు, కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ నిర్మాణం మాకున్న ఏకైక ప్రత్యామ్నాయం’ అని కోల్‌కతా మెట్రోరైల్ కార్పొరేషన్ జీఎం (సివిల్) శైలేష్‌కుమార్ తెలిపారు. హావ్‌డా-సీల్దా నడుమ రోడ్డు ప్రయాణానికి ప్రస్తుతం గంటన్నర సమయం పడుతోందని, ఈ మెట్రో మార్గం ఏర్పాటుతో అది 40 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా