సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్‌ గవర్నర్‌

రాజ్‌భవన్‌ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు.

Published : 10 May 2024 05:38 IST

కోల్‌కతా: రాజ్‌భవన్‌ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. గత నెల 24న, ఈ నెల 2న తనపై గవర్నర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ కాంట్రాక్టు మహిళా సిబ్బంది శుక్రవారం కోల్‌కతా పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫుటేజీని మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకులకు, ఆమె పోలీసులకు తప్ప సాధారణ పౌరులందరికీ చూపిస్తానని బుధవారం బోస్‌ తెలిపారు. దాదాపు గంటన్నరసేపు ఫుటేజీలో మహిళ నీలం రంగు జీన్స్‌, టాప్‌తో రాజ్‌భవన్‌ ప్రాంగణంలోని పోలీస్‌ అవుట్‌ పోస్టువైపు వెళుతున్నట్లు కనిపించింది. ‘‘సీసీటీవీ ఫుటేజీ చూడటానికి దాదాపు 92 మంది ఆసక్తి వ్యక్తపరిచారు. కొందరు మాత్రమే వచ్చారు. సంఘటనపై ప్రజలే ఒక నిర్ణయానికి రావాలన్నదే ఉద్దేశం’’ అని రాజ్‌భవన్‌ అధికారి ఒకరు తెలిపారు. ఫుటేజీని చూసిన వారిలో ఒకరైన ప్రొఫెసర్‌ తుషార్‌ కాంతి ముఖర్జీ.. మహిళ ప్రవర్తనలో ఎక్కడా అసాధారణత కనిపించలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు