నేడు తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి.

Published : 10 May 2024 05:30 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. శీతాకాలంలో మూసేసిన ఈ ఆలయాలను ఇప్పుడు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ‘చార్‌ధామ్‌ యాత్ర’లో భాగమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు. ఆనవాయితీ ప్రకారం.. 47 కి.మీ. దూరంలో ఉన్న ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌ ఆలయం నుంచి కేదార్‌ బాబా పంచముఖ విగ్రహాన్ని వాలంటీర్లు పాదరక్షలు లేకుండా కాలి నడకన భుజాలపై మోస్తూ తీసుకొచ్చినట్లు¸ కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ మీడియా ఇంఛార్జి  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని