అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు

సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్‌లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది.

Published : 10 May 2024 05:36 IST

దిల్లీ: సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్‌లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. తన సమ్మతి లేకుండా తన అశ్లీల చిత్రాలను ప్రదర్శిస్తున్న కొన్ని వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని ఒక మహిళ పెట్టిన అర్జీపై సింగిల్‌ జడ్జి కోర్టు పైమేరకు ఆదేశాలు జారీ చేసింది. బాలలపై లైంగిక అత్యాచారం జరిగిన సందర్భాలను వెంటనే గుర్తించి తొలగించే సాంకేతికత తమకు ఉందనీ, వయసొచ్చిన ఇద్దరు వ్యక్తుల నడుమ అంగీకారం లేకుండా జరిగే లైంగిక చర్యల కేసుల్లో ఆ అసభ్య చిత్రాలను గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని సెర్చింజన్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. సెర్చింజన్లు తమంతట తాము ఎలాంటి సమాచారాన్ని కానీ, చిత్రాలను కానీ ప్రచురించవన్నారు. అభ్యంతరకర సమాచారం తమ దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని తొలగిస్తామని వివరించారు. సింగిల్‌ జడ్జి ఆదేశాన్ని పాటించలేదంటూ తమపై శిక్షతో కూడిన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని సెర్చింజన్లు కోరాయి. ఇంతవరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదని, సింగిల్‌ జడ్జి తీర్పుపై అదే కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని హైకోర్టు పిటిషనర్లకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు