కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు

దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.

Published : 10 May 2024 05:25 IST

దిల్లీ: దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఇవి పగటిపూట నిందితులు జైలు ఆవరణ ఆవల పనిచేసుకోవడానికి అవకాశమిస్తాయి. సాయంత్రం వారంతా తిరిగి జైలుకు చేరతారు. తద్వారా వారు జీవనోపాధి పొందుతారు. దేశవ్యాప్తంగా బహిరంగ జైళ్లను విస్తరింపచేయాలని జైళ్లు, ఖైదీల అంశంపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని