మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్‌

థాయిలాండ్‌కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

Published : 10 May 2024 05:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థాయిలాండ్‌కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో ప్రత్యేకంగా వీసా అవసరం లేకుండానే థాయిలాండ్‌ అందాలను చూసి రావచ్చు. సాధారణ పాస్‌పోర్టు ఉన్నవారు అక్కడ గరిష్ఠంగా 30 రోజులపాటు పర్యటించవచ్చు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్‌ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్‌, తైవాన్‌ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు నవంబరు 10, 2023 నుంచి అనుమతి ఇచ్చింది. ఈ గడువు మే 10, 2024తో ముగుస్తోంది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ఈ వెసులుబాటును మరో ఆరు నెలలపాటు పెంచుతూ రాయల్‌ థాయ్‌ క్యాబినెట్‌ నిర్ణయించింది. నవంబరు 11, 2024 వరకు ఇది వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని