Super Memory: రెండున్నరేళ్ల చిన్నారి.. ‘సూపర్‌ మెమరీ’

పశ్చిమబెంగాల్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి తన అసమాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. నిమిషాల వ్యవధిలోనే వివిధ రకాల పక్షులు, జంతువుల పేర్లు, వాటి శాస్త్రీయ నామాలు చెప్పేస్తోంది.

Updated : 04 Jan 2023 08:10 IST

పశ్చిమబెంగాల్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి తన అసమాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. నిమిషాల వ్యవధిలోనే వివిధ రకాల పక్షులు, జంతువుల పేర్లు, వాటి శాస్త్రీయ నామాలు చెప్పేస్తోంది. తన అద్భుత జ్ఞాపక శక్తితో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించింది.

హూగ్లీ జిల్లా చిన్సురాకు చెందిన అభిజిత్‌ బిశ్వాస్‌, రాజ్‌ కుమారి దంపతుల కుమార్తె అధిష్ఠాత్రి చిన్న వయసులోనే వివిధ రకాల కార్ల సంస్థల పేర్లను ఏ నుంచి జడ్‌ వరకు చెబుతుంది. 100 వరకు జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు సమాధానాలనూ ఇస్తోంది. ‘‘మా చిన్నారికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. వాటన్నింటినీ రికార్డు చేసి, ఆ వీడియోను ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థలకు పంపాం. దాంతో అధిష్ఠాత్రి ప్రతిభను గుర్తించిన ఆ  సంస్థలు అవార్డులను ప్రకటించాయి’’ అని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని