తీస్తా సీతల్వాద్‌ దంపతులను మళ్లీ కస్టడీకి ఎందుకు పంపించాలి?

ముందస్తు బెయిల్‌పై విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత సామాజిక ఉద్యమకారిణి తీస్తా సీతల్వాద్‌, ఆమె భర్త జావెద్‌ ఆనంద్‌ను మళ్లీ ఎందుకు జైలుకు పంపించాలనుకుంటున్నారని సీబీఐ, గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Published : 26 Jan 2023 05:19 IST

సీబీఐ, గుజరాత్‌ ప్రభుత్వాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: ముందస్తు బెయిల్‌పై విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత సామాజిక ఉద్యమకారిణి తీస్తా సీతల్వాద్‌, ఆమె భర్త జావెద్‌ ఆనంద్‌ను మళ్లీ ఎందుకు జైలుకు పంపించాలనుకుంటున్నారని సీబీఐ, గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘ముందస్తు బెయిల్‌ మంజూరై ఏడేళ్లు గడిచింది. మళ్లీ ఆమెను కస్టడీకి పంపించాలని అంటున్నారు. ఒక వ్యక్తిని ఎంత కాలం కస్టడీలో ఉంచుతారు?’ అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం నిలదీసింది. ఆమెపై ఉన్న కేసులకు సంబంధించి మరికొంత అదనపు సమాచారాన్ని కోర్టు ముందుంచాల్సి ఉందని, నాలుగు వారాల సమయం కావాలని సీబీఐ, గుజరాత్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది రజత్‌ నాయర్‌ విన్నవించారు. కేసు తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని