నా భూమి నుంచి నన్ను గెంటేయడానికి ఎందుకీ ఉత్సాహం?

భూవివాదంపై విశ్వభారతి విశ్వవిద్యాలయ ఉప రిజిస్ట్రార్‌ రాసిన లేఖపై అమర్త్యసేన్‌ బుధవారం స్పందించారు.

Published : 26 Jan 2023 05:28 IST

విశ్వభారతి విశ్వవిద్యాలయ ఉప రిజిస్ట్రార్‌ లేఖపై అమర్త్యసేన్‌

కోల్‌కతా: భూవివాదంపై విశ్వభారతి విశ్వవిద్యాలయ ఉప రిజిస్ట్రార్‌ రాసిన లేఖపై అమర్త్యసేన్‌ బుధవారం స్పందించారు. ‘‘శాంతినికేతన్‌ ప్రాంగణంలో ఉన్న నా భూమి నుంచి నన్ను బయటకు గెంటేయడానికి విశ్వవిద్యాలయం ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తుందో అర్థం కావట్లేదు. నియమ నిబంధనల ప్రకారమే నేను ఇక్కడ నివసిస్తున్నాను’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఛాన్సలర్‌గా ఉన్న ఈ విశ్వవిద్యాలయ ఉప రిజిస్ట్రార్‌ మంగళవారం లేఖ రాస్తూ.. ‘‘అమర్త్యసేన్‌ తండ్రి అశుతోష్‌సేన్‌ 1943లో 125 సెంట్ల భూమిని విశ్వవిద్యాలయం నుంచి లీజుకు తీసుకున్నారు. అమర్త్యసేన్‌ కుటుంబం అదనంగా 13 సెంట్ల భూమిని ఆక్రమించింది. దాన్ని తిరిగి ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు