కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లించే కరవు భత్యాన్ని నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లించే కరవు భత్యాన్ని నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. ఈ విషయమై అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్ర ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. గతేడాది డిసెంబరుకు సంబంధించిన ‘పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ’ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆర్థికశాఖ ఈ మేర డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే.. తాజా డీఏ పెంపు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరవు భత్యం పొందుతున్నారు. డీఏలో చివరి సవరణ 2022 సెప్టెంబరు 28న జరిగింది. ఇది 2022 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం ఏటా రెండుసార్లు సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్‌కు ఆశ్రయం.. హరియాణా మహిళ అరెస్టు..!
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
General News
TSPSC: పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Navjot Singh: సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ‘ఇక వేచి ఉండలేనంటూ’ ట్వీట్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!