వేల గుండెలు కాపాడిన 41 ఏళ్ల వైద్యుడు.. గుండెపోటుతో మృతి

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రాంతంలో సుమారు 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసి, గుండె జబ్బులపై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ గౌరవ్‌గాంధీ (41) అనూహ్యంగా గుండెపోటుతో మృతిచెందారు.

Published : 08 Jun 2023 03:57 IST

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రాంతంలో సుమారు 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసి, గుండె జబ్బులపై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ గౌరవ్‌గాంధీ (41) అనూహ్యంగా గుండెపోటుతో మృతిచెందారు. రోజూలాగే సోమవారం రాత్రి ఆస్పత్రిలో పని ముగించుకొని ప్యాలెస్‌ రోడ్డులో ఉన్న ఇంటికి ఆయన చేరుకున్నారు. ఇంట్లోవాళ్లతో కలిసి భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించారు. రోజూ ఉదయం ఆరింటికల్లా నిద్ర లేచేవారని, మంగళవారం ఉదయం ఆరు దాటినా లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి పిలవగా స్పందించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించామని.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. డాక్టర్‌ గాంధీ మృతి స్థానికులను కలచివేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని