Sachin Tendulkar: సచిన్‌ తెందుల్కర్‌ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఇంటి ముందు ప్రహార్‌ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బచ్చూ కాడూ గురువారం తన అనుచరులతో కలసి నిరసన చేపట్టారు.

Updated : 01 Sep 2023 07:21 IST

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ప్రచారంపై నిలదీత

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఇంటి ముందు ప్రహార్‌ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బచ్చూ కాడూ గురువారం తన అనుచరులతో కలసి నిరసన చేపట్టారు. ప్రతిష్ఠాత్మక భారతరత్న పురస్కార గ్రహీత అయిన తెందుల్కర్‌.. యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ప్రచారం చేయడం ఏంటని ఆయన నిలదీశారు. తెందుల్కర్‌ భారతరత్నను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ప్రచార ప్రకటనల నుంచి ఆయన వైదొలగకపోతే, ప్రతి గణేశ్‌ మంటపం ముందు ధర్నా చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులను అక్కడి నుంచి తరలించారు. బచ్చూ కాడూతోపాటు 22 మందిపై కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని